నడిరోడ్డుపై చెప్పుతో కొడతా

‘జనాలవద్ద చేతివాటం ప్రదర్శించినట్లు రుజువైతే నడిరోడ్డుపై ఒక్కొక్కడ్ని చెప్పుతో కొడతా’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాలంటీర్లను తీవ్రంగా హెచ్చరించారు.

Updated : 27 Sep 2022 06:16 IST

వాలంటీర్లను హెచ్చరించిన ధర్మవరం ఎమ్మెల్యే

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘జనాలవద్ద చేతివాటం ప్రదర్శించినట్లు రుజువైతే నడిరోడ్డుపై ఒక్కొక్కడ్ని చెప్పుతో కొడతా’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాలంటీర్లను తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం ఎమ్మెల్యే స్వయంగా వాలంటీర్లు, కౌన్సిలర్లకు పంపిన వాయిస్‌ రికార్డులు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. అందులో... ‘గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ టు వాలంటీర్స్‌. నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. మీ వార్డుల్లో వాలంటీర్ల ద్వారా కరప్షన్‌ చేయమని చెప్పేసి, చేస్తున్నారని నా దృష్టికొచ్చింది. ఎవడైనా జనం దగ్గర తీసుకున్నట్టు తెలిస్తే ఒక్కొక్కడ్ని నడిరోడ్డులో చెప్పుతో కొడతా. మర్యాదగా జనాల వద్దకెళ్లి డబ్బులు ఇచ్చి రండి’ అని స్పష్టం చేశారు. కౌన్సిలర్లకు పంపిన మరో వాయిస్‌ రికార్డులో... ‘గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ టు ద కౌన్సిలర్స్‌. మనవాళ్లు ఒకట్రెండు చోట్ల చెయ్యి చాపుతున్నారు. దానికంటే దరిద్రం లేదు. దయచేసి ఇంకోసారి ఇది రిపీట్‌ చేయొద్దు. చేస్తే నేను క్రిమినల్‌ కేసులు పెట్టిస్తా. జీవితంలో ఎప్పుడూ తేరుకోలేని విధంగా చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని