శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రత: డీజీపీ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డి తెలిపారు.

Published : 27 Sep 2022 03:59 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల విధులు నిర్వహించే పోలీసు అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే 1500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఘాట్‌రోడ్లు, రద్దీ ప్రాంతంలో బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. ఆక్టోపస్‌ సిబ్బంది కూడా తిరుమలలో ప్రత్యేక నిఘా పెడతారని వివరించారు. తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. తిరుపతి, తిరుమలలో 38 పాయింట్లలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే చిన్నపిల్లలు, వృద్ధులకు జియో ట్యాగ్‌లు వేస్తామని, వీటిని ప్రతి ఒక్కరూ చేతికి కట్టుకోవాలని సూచించారు. 250 మంది ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించి దొంగతనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యారని తెలిపారు. ఆయన వెంట అనంతపురం రేంజీ డీఐజీ ఎం.రవిప్రకాష్‌, తితిదే సీవీఎస్‌వో నరసింహకిశోర్‌, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని