వైకాపా నాయకుడు దుర్భాషలాడారు

దళిత మహిళా సర్పంచినని చూడకుండా అధికార పార్టీకి చెందిన నాయకుడు తనను దుర్భాషలాడారని ముదివర్తి సర్పంచి విడవలూరు నిర్మలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 27 Sep 2022 03:59 IST

దళిత మహిళా సర్పంచి ఆవేదన

ముదివర్తి (విడవలూరు), న్యూస్‌టుడే: దళిత మహిళా సర్పంచినని చూడకుండా అధికార పార్టీకి చెందిన నాయకుడు తనను దుర్భాషలాడారని ముదివర్తి సర్పంచి విడవలూరు నిర్మలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ముదివర్తిలో ఆమె సోమవారం గ్రామస్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల క్రితం ముదివర్తి గ్రామ సర్వే నంబరు 48, 49లలో 2.67 సెంట్లలో ఎస్సీ కాలనీలో 60 మంది ఎస్సీలకు అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. వాటిపై కన్నేసిన స్థానిక వైకాపా నాయకుడు తన అనుచరులకు ఇళ్ల స్థలాలను ఇప్పించాలని సర్వే చేయించి.. అధికారులపై ఒత్తిడి చేశారు. ఈ విషయమై ప్రశ్నిస్తే.. నన్ను దుర్భాషలాడారు. అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు...’అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని