రైతు కష్టాన్ని ముంచిన వరుణుడు

వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లను ఎదురొడ్డి పండించిన పంటను వరుణుడు ముంచేయడంతో కర్షకులకు కన్నీరే మిగిలింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కరివేన, నల్లకాల్వ,....

Updated : 27 Sep 2022 06:11 IST

వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లను ఎదురొడ్డి పండించిన పంటను వరుణుడు ముంచేయడంతో కర్షకులకు కన్నీరే మిగిలింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కరివేన, నల్లకాల్వ, బాపణంతాపురం గ్రామాల పరిధిలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగు చేశారు. ముందస్తుగా సాగైన సుమారు 700 ఎకరాల్లో పంటలు కోత కోశారు. నూర్పిడి చేసిన మొక్కజొన్న దిగుబడులను పొలాల్లో ఆరబోశారు. మంగళవారం విక్రయించాల్సి ఉండగా సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆరబెట్టిన మొక్కజొన్న దిగుబడులు పూర్తిగా తడిసిపోయాయి. పూర్తిగా మునిగిన దిగుబడులను ఏంచేయాలో దిక్కుతోచడం లేదని కర్షకులు కన్నీరుపెడుతున్నారు.

- న్యూస్‌టుడే, ఆత్మకూరు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts