పోటీలతోనే నవలా వికాసం

తానా నిర్వహించిన నవలల పోటీలు తెలుగు సాహిత్యంలో నవలా వికాసానికి దోహదం చేస్తాయని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ‘తానా’ నవలల పోటీలో చింతకింది శ్రీనివాసరావు

Published : 27 Sep 2022 04:44 IST

‘తానా’ బహుమతి నవలల ఆవిష్కరణ సభలో నందిని సిధారెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తానా నిర్వహించిన నవలల పోటీలు తెలుగు సాహిత్యంలో నవలా వికాసానికి దోహదం చేస్తాయని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ‘తానా’ నవలల పోటీలో చింతకింది శ్రీనివాసరావు రచించిన ‘మున్నీటి గీతలు’, బండి నారాయణస్వామి రాసిన ‘అర్ధనారి’ బహుమతి పొందాయి. వీటి ఆవిష్కరణ మహోత్సవం సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో నిర్వహించారు. కవి కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నవలా రచయితలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తానా నవలల పోటీ తెలుగు సాహిత్యానికి గొప్ప సేవ చేస్తోందన్నారు. ఎక్కువ జీవితాలను ప్రతిబింబించేది నవల అని కొనియాడారు. సినిమాకు, సాహిత్యానికి దూరం చెరిగిపోవడం సంతోషమే కానీ.., సినిమాల ద్వారానే ఆ ప్రమాణాలు సాహిత్యంలోకి వస్తే మాత్రం అది దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ‘మున్నీటి గీతలు’ ఆవిష్కరించిన సినీ దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన నవలలు వస్తున్నాయన్నారు. సుప్రసిద్ధ రచయిత వీరభద్రప్ప ‘అర్ధనారి’ నవలను ఆవిష్కరించారు. కథాసాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.., నవలా పోటీ న్యాయనిర్ణేతలు మధురాంతకం నరేంద్ర, మహ్మద్‌ ఖదీర్‌బాబులు నవలలను పరిచయం చేశారు. తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు మాట్లాడారు. తానా నవలల పోటీ సమన్వయకర్త జంపాల చౌదరి, ప్రచురణ కమిటీ అధ్యక్షుడు కన్నెగంటి చంద్ర తదితరులున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని