దుర్గమ్మ చెంత.. ఆకలి చింత...

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గగుడికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. క్యూలైన్లు, రహదారి శుభ్రం ఇలా వివిధ పనులు చేయడానికి తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కూలీలను గుత్తేదారులు తీసుకువచ్చారు.

Published : 27 Sep 2022 05:25 IST

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గగుడికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. క్యూలైన్లు, రహదారి శుభ్రం ఇలా వివిధ పనులు చేయడానికి తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కూలీలను గుత్తేదారులు తీసుకువచ్చారు. మూడు రోజులైనా తమకు సరైన ఆహారం, వసతి కల్పించలేదని కూలీలు వాపోయారు. తెల్లవారుజాము నుంచే పనులు చేయించుకుంటున్నా కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని, అడిగితే ఆలయంలో, దాతలు ఇచ్చే ఆహార పొట్లాలు, తాగునీరు తెచ్చుకోవాలని చెప్పారన్నారు. దీంతో అభాగ్యుల కోసం దాతలు తెచ్చిన ఆహారం కోసం పోటీపడ్డారు. కొందరికి ఆహార పొట్లాలు దొరకగా, మరికొందరికి తాగడానికి నీటిప్యాకెట్లు మాత్రమే దొరికాయని తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న అసంపూర్తి భవనం ముందు తమగోడు వెళ్లబోసుకుంటున్నారు.

- ఈనాడు, అమరావతి

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts