ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యుల కుదింపుపై వ్యాజ్యం కొట్టివేత

ఏపీ ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యులను నలుగురికి కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

Published : 27 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: ఏపీ ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యులను నలుగురికి కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు తీర్పు ఇచ్చింది. ఏపీ ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యులను కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పాలెపు శ్రీనివాసులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ..‘ దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 152 ప్రకారం ధార్మిక పరిషత్‌లో 21 మంది సభ్యులుగా ఉండాలి. తాజాగా తెచ్చిన సవరణ చట్టంలో దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఎండోమెంట్‌ కమిషనర్‌, తితిదే కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది(జీపీ) రజని వాదనలు వినిపిస్తూ.. 21 మంది సభ్యుల కమిటీని కుదించలేదన్నారు. అంతమందిని ఏర్పాటు చేయడం సాధ్యంకానప్పుడు మాత్రమే నలుగురు సభ్యుల కమిటీ విధులను నిర్వహిస్తుందన్నారు. ఇటీవల పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ పిల్‌ను కొట్టేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts