ఏపీఐఐసీ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్‌

పారిశ్రామికవాడల అభివృద్ధికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు.

Published : 27 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: పారిశ్రామికవాడల అభివృద్ధికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ఏపీఐఐసీ 50వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ లోగోను సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడాదిలో నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ఏపీఐఐసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం అందించిన స్ఫూర్తితో పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్‌నాథ్‌, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, హరిత పారిశ్రామికీకరణ పరంగా చేస్తున్న ప్రయత్నాలను తెలిపేలా స్వర్ణోత్సవ లోగోను నాలుగు రంగులతో రూపొందించినట్లు ఏపీఐఐసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని