ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా అందని జీతాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా జీతాలు అందడం లేదు.

Published : 27 Sep 2022 05:25 IST

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా జీతాలు అందడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదులను మూడేళ్ల పదవీకాలానికి నియమించారు. ఈ పదవీకాలం మరికొద్ది నెలల్లో పూర్తవుతుంది. 2014లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ న్యాయవాదుల వేతనాలను రూ.15 వేల నుంచి రూ.30 వేలకు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులకు రూ.9 వేల నుంచి రూ.18 వేలకు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ వేతనాలను తమకు 2020 జనవరి నుంచి చెల్లించడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని