దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌

దసరా సందర్భంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ ఢిల్లీరావు,

Published : 27 Sep 2022 05:38 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దసరా సందర్భంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ ఢిల్లీరావు, దేవస్థానం ఈవో భ్రమరాంబ, సీపీ కాంతిరాణా టాటా, ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్‌ వారికి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌కు దేవస్థానం ప్రధానార్చకులు దుర్గాప్రసాద్‌, కలెక్టర్‌, ఈవోలు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అమ్మవారి స్నపనాభిషేకం పూర్తయిన తరువాత 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. దసరా ఉత్సవాల తొలి రోజున 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని