చేతలే.. చేతులై.. ముందడుగు..!

ఈ చిత్రంలోని బాలిక పేరు షేక్‌ ఫరీదాబాను. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లతో కూడా అందరిలా నడవలేని పరిస్థితి. అయినా మనోవేదనకు గురికాకుండా ముందుకు సాగుతోంది. కాలి వేళ్లు తోడుగా

Published : 28 Sep 2022 04:12 IST

ఈ చిత్రంలోని బాలిక పేరు షేక్‌ ఫరీదాబాను. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లతో కూడా అందరిలా నడవలేని పరిస్థితి. అయినా మనోవేదనకు గురికాకుండా ముందుకు సాగుతోంది. కాలి వేళ్లు తోడుగా అక్షరాలు దిద్దుతోంది. చేతితో రాసినంత అందంగానే ముత్యాల్లా అక్షరాలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ బాలిక స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శివశంకర్‌నగర్‌. తల్లిదండ్రులు షేక్‌ మహమ్మద్‌ జాఫర్‌, షేక్‌ నసీంబాను.  ప్రస్తుతం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ‘రెండు చేతులు లేవని ఎప్పుడూ అధైర్యపడలేదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అండగా నిలుస్తూ నన్ను ప్రోత్సహించడం వల్ల కాలివేళ్లతో రాయడం నేర్చుకున్నా. చదువులో ముందడుగు వేస్తున్నా. ఇంట్లో నా పనులు నేనే చేసుకుంటా. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నా’ అని ఫరీదాబాను ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

- న్యూస్‌టుడే, ఆదోని విద్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని