విరామంలోనూ నినాదం

మహా పాదయాత్రలో అలసిన అమరావతి రైతులు విరామం రోజునా నినదించారు. వారిని అలరించేందుకు కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. అమరావతి

Published : 28 Sep 2022 04:12 IST

సాంస్కృతిక ప్రదర్శనలతో అమరావతి రైతుల ఉత్సాహం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: మహా పాదయాత్రలో అలసిన అమరావతి రైతులు విరామం రోజునా నినదించారు. వారిని అలరించేందుకు కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. అమరావతి నుంచి అరసవల్లి దాకా చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం ఏలూరు జిల్లాలోకి  ప్రవేశించింది. రైతులు మంగళవారం యాత్రకు విరామం ప్రకటించి, వట్లూరు క్రాంతి కల్యాణ మండపంలో బసచేశారు. వీరికి ఆటవిడుపు కోసం మాజీ ఎంపీ మాగంటి బాబు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అమరావతి నేపథ్యంలో సాగే ఆటపాటలతో కళాకారులు అలరించారు. జయహో అమరావతి అంటూ ఇచ్చిన ప్రదర్శనకు రైతులు కుర్చీల్లోంచి లేచి కండువాలను గాలిలో తిప్పుతూ ఉత్సాహం కనబరిచారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని నిస్వార్థ చింతనతో యాత్రలో పాల్గొంటున్న అన్నదాతలకు పలువురు నాయకులు, స్థానికులు పాదాభివందనం చేశారు. పాదయాత్ర బుధవారం ఏలూరు, దెందులూరు మండలాల్లో కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని