ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖపట్నానికి చెందిన సుమారు 20 మంది ఈనెల 18న దైవదర్శనం కోసం ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. పర్యటనకు వెళ్లిన

Updated : 28 Sep 2022 06:10 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన సుమారు 20 మంది ఈనెల 18న దైవదర్శనం కోసం ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. పర్యటనకు వెళ్లిన వారంతా మంగళవారం తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది. ఇంతలో అక్కడ వాతావరణ పరిస్థితులు మారి భారీ వర్షం కురియడంతో రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడి పూర్తిగా దెబ్బతింది. దీంతో వారు విమానాశ్రయానికి చేరుకునే వీలు లేక గంజ్‌ ప్రాంతంలోని హోటల్‌ గదిలోనే ఉండిపోయారు. వారితోపాటు పర్యటనకు వెళ్లిన తెలంగాణకు చెందిన వారంతా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో హెలీకాప్టర్లలో స్వస్థలాలకు బయలుదేరారని, తమవారినీ వెంటనే తీసుకురావాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. చిక్కుకుపోయిన వారిలో విశాఖ స్టీల్‌ప్లాంటు పరిసరాల్లో నివసించే 10 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని