జీవిత పన్ను చెల్లిస్తామన్న వాహనదారులు, డీలర్లు

రాష్ట్రంలో ఇద్దరు టొయోటా డీలర్ల వద్ద వాహనాలు తీసుకొని, ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాటికి... జీవితపన్ను కట్టించుకొని, రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వాటికి

Updated : 28 Sep 2022 05:39 IST

16 టొయోటా వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇద్దరు టొయోటా డీలర్ల వద్ద వాహనాలు తీసుకొని, ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాటికి... జీవితపన్ను కట్టించుకొని, రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వాటికి జీవితపన్ను చెల్లించేందుకు వాహనదారులు, డీలర్లు ముందుకు రావడంతో 16 వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసేలా ఆ శాఖ కమిషనర్‌ పీ.సీతారామంజనేయులు ఆదేశించినట్లు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. రాధామాధవ్‌ టొయోటా, లీలాకృష్ణ టొయోటా డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా షోరూముల్లో 32 వాహనాలు విక్రయించినప్పటికీ.. వాటికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ కాలేదు. వాటి జీవిత పన్ను ప్రభుత్వానికి జమకాలేదని రవాణాశాఖ గుర్తించింది. ఆయా వాహనదారులంతా రవాణాశాఖ కార్యాలయాల్లో మంగళవారం హాజరుకావాలని సూచించగా రాష్ట్రంలో వివిధ రవాణాశాఖ కార్యాలయాలకు 23 మంది వచ్చారు. వీరిలో 16 మంది వద్ద వాహనాల పత్రాలు ఉన్నాయి. వీరందరితో రవాణాశాఖ కమిషనర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీటికి జీవిత పన్ను చెల్లిస్తే రవాణాశాఖ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని స్పష్టంచేశారు. దీంతో ఎనిమిది మంది జీవిత పన్ను చెల్లించేందుకు అంగీకరించారు. మరో ఎనిమిది మంది తాము డీలర్లకు ముందే చెల్లించామని చెప్పడంతో... ఆయా డీలర్లు ఆ మొత్తం కట్టేందుకు అంగీకరించారు. దీంతో మొత్తం 16 వాహనాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇక ఎలాంటి పత్రాలులేని ఏడు వాహనాలపై అధికారులు విచారించనున్నారు. అలాగే మరో 9 మంది వాహనదారులు మంగళవారం రవాణాశాఖ కార్యాలయాలకు రాలేదు. వీరి గురించి కూడా ఆరా తీయనున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని