వ్యర్థాలు పోస్తూ.. చెరువును పూడ్చేస్తూ!

మూడు గ్రామాలకు తాగునీరు.. దాదాపు 250 ఎకరాలకు సాగునీరందించే చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని చెన్నుపల్లి చెరువులో

Published : 28 Sep 2022 05:17 IST

మూడు గ్రామాలకు తాగునీరు.. దాదాపు 250 ఎకరాలకు సాగునీరందించే చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని చెన్నుపల్లి చెరువులో యథేచ్ఛగా గ్రానైట్‌ వ్యర్థాలను పోసి ఆక్రమిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈనాం భూములతో కలిపి 90 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు నీటితో కళకళలాడేది. 11 ఎకరాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాలు చేపట్టి మూడు గ్రామాలకు దాహార్తి తీర్చాలనే లక్ష్యంగా చెరువు కట్టలను పటిష్ఠం చేశారు. గ్రామీణుల దాహం తీర్చే ఆ చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై చీరాల ఆర్డీవో సరోజిని వివరణ కోరగా.. వెంటనే విచారించి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

- ఈనాడు, బాపట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని