తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయ్‌

తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయంటూ తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు. వారు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు

Published : 29 Sep 2022 03:17 IST

రమణ దీక్షితులు ట్వీట్‌

ఈనాడు, తిరుపతి: తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయంటూ తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు. వారు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అర్చకులు భావించారని అందులో ప్రస్తావించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశపరిచిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని