269 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు

269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ బుధవారం 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలనూ ప్రకటించింది. 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26

Published : 29 Sep 2022 03:11 IST

జారీ చేసిన ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ బుధవారం 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలనూ ప్రకటించింది. 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్స్‌, మూడు ఆయుర్వేద లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. 11/2022 నోటిఫికేషన్‌ కింద ఏపీ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ సబ్‌ సర్వీస్‌లో 12 శాంపిల్‌ టేకర్‌, 8 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, ఇతర పోస్టులు కలిపి 45 ఉన్నాయి. 23 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, ఏడు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీచేసింది. 06/2022 నోటిఫికేషన్‌ కింద ఆరు పోస్టులను గ్రూప్‌-4 కేటగిరీలో భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని