శ్రీవారిని మరోసారి దర్శించుకున్న సీఎం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి సేవలో

Published : 29 Sep 2022 03:17 IST

 నూతన పరకామణి భవనం ప్రారంభం

ఈనాడు, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాత్రి తిరుమలలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో బస చేసిన ఆయన.. బుధవారం ఉదయం 6.25 గంటలకు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన తరువాత సీఎం మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఎదురుగా రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. భవన నిర్మాణానికి విరాళం అందించిన దాత మురళీకృష్ణను అభినందించారు. ఆయన కుటుంబ సభ్యులకు శాలువా కప్పి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందించి సత్కరించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన వీపీఆర్‌ విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీపద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు బయల్దేరి వెళ్లారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని