గంజాయిలో ఏపీ టాప్‌

ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో

Published : 29 Sep 2022 06:46 IST

 ఎక్కువ సరకు దొరికింది మన రాష్ట్రంలోనే

2021లో 2లక్షల కిలోలు స్వాధీనం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. 2021లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై ఎన్‌సీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హషీష్‌ 18.14 కిలోలు, హషీష్‌ ఆయిల్‌ 6.13 లీటర్లు, 3 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో 1,775 కేసులు నమోదుచేసి, 4,202 మందిని అరెస్టు చేశారు. తెలంగాణలో 35,270 కిలోల గంజాయి, 0.03 కిలోల హషీష్‌, 18.5 లీటర్ల హషీష్‌ ఆయిల్‌, 0.03 కిలో హెరాయిన్‌, 0.01 కిలోల కెటామైన్‌, 31 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7,618 కిలోల హెరాయిన్‌ దొరకగా, అందులో అత్యధికంగా 3,334.96 కిలోలు గుజరాత్‌లో, 1,337.29 కిలోలు ఉత్తర్‌ప్రదేశ్‌లో, 501 కిలోలు మేఘాలయలో స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాదిలో కేరళలో అత్యధికంగా 339.93 కిలోల హెరాయిన్‌ దొరికింది. డ్రగ్స్‌ అత్యధిక ప్రభావం ఉన్నట్లు ప్రచారం జరిగిన పంజాబ్‌లో 443.51 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts