అర్చకేతరులే వ్యవస్థను నాశనం చేస్తున్నారు

తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి, పెద్దింటి కుటుంబాలకు చెందిన అర్చక స్వాములు

Published : 29 Sep 2022 03:33 IST

ప్రధానార్చకుల స్పందన

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి, పెద్దింటి కుటుంబాలకు చెందిన అర్చక స్వాములు విలేకరులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. రమణ దీక్షితుల ట్వీట్‌ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అర్చక వ్యవస్థను అర్చకేతరులే నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వారెవరో రమణ దీక్షితులకే తెలియాలని, మిరాశీ కుటుంబాలకు ఉన్న అన్నిరకాల వంశపారంపర్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తోందని స్పష్టం చేశారు. నాలుగురోజుల కిందట తమ కుటుంబంలోని ఇద్దరిని సర్వీసులోకి తీసుకుందన్నారు. సమావేశంలో ప్రధాన అర్చకులు కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్‌ దీక్షితులు, గోపినాథ్‌ దీక్షితులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని