గాయత్రీ దేవిగా దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ బుధవారం గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. దసరా శరన్నవరాత్రోత్సవాల మూడో రోజు అమ్మవారిని సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాత గాయత్రీ దేవిగా అలంకరించారు.

Updated : 29 Sep 2022 03:54 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ బుధవారం గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. దసరా శరన్నవరాత్రోత్సవాల మూడో రోజు అమ్మవారిని సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాత గాయత్రీ దేవిగా అలంకరించారు. తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి రెండు రోజుల్లో రూ.63లక్షల ఆదాయం వచ్చింది. నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది.


చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై అధిష్ఠింపజేసి విశేష పూజలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని