కాలువ తవ్వుకున్నారు.. రోడ్డు వేసుకున్నారు

తమ పొలాల వరకు కాలువ, రోడ్డు సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా ఆ రైతులు చేసిన విన్నపాలను ఏ పాలకుడూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన అన్నదాతలు తమ శ్రమను నమ్ముకొని కార్యక్షేత్రంలోకి దిగారు. సొంతంగా తామే కాలువను

Published : 29 Sep 2022 03:33 IST

తమ పొలాల వరకు కాలువ, రోడ్డు సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా ఆ రైతులు చేసిన విన్నపాలను ఏ పాలకుడూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన అన్నదాతలు తమ శ్రమను నమ్ముకొని కార్యక్షేత్రంలోకి దిగారు. సొంతంగా తామే కాలువను తవ్వుకున్నారు. రహదారి పనులు సైతం మొదలుపెట్టారు. ఇదీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని తాళ్లూరు రైతుల ఐక్యతకు దర్పణం. గ్రామస్థులకు బోగోలు, బ్రాహ్మణక్రాక రహదారులు, భవనాల రోడ్డుకు ఉత్తరాన 70 ఎకరాల పొలాలు ఉన్నాయి. వీటికి పంట కాలువ, రోడ్డు సౌకర్యం లేదు. ప్రజాప్రతినిధులందరికీ సమస్యను వివరించారు. ఎవరూ కష్టాలకు ముగింపు పలకలేదు. రైతులు అమిరిశెట్టి శ్రీనివాసులు, ఇండ్ల భుజంగరావు, అవిసాల ప్రసాద్‌రెడ్డి, మునగాల వరదారెడ్డి, లక్కాకుల ఏడుకొండలు తదితరుల ఆధ్వర్యంలో సొంతంగా రహదారి, కాలువ ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. బుధవారం సమావేశమై ఎకరాకు రూ.5 వేల చొప్పున వేసుకున్నారు. రోడ్డు, పంట కాలువకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా సమకూర్చుకున్నారు. రైతులు శ్రమదానం చేశారు. ర.భ రోడ్డు దగ్గర నుంచి 650 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు రోడ్డు ఏర్పాటు పనులు ప్రారంభించారు. పొక్లెయినరుతో పంట కాలువ తీశారు.  

         -న్యూస్‌టుడే, బిట్రగుంట

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని