ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీసు విధానాలే ఆదర్శం: హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ యాప్‌, సైబర్‌ మిత్ర, మహిళా సహాయ కేంద్రాలు, గ్రామ మహిళా పోలీసుల

Published : 29 Sep 2022 03:33 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ యాప్‌, సైబర్‌ మిత్ర, మహిళా సహాయ కేంద్రాలు, గ్రామ మహిళా పోలీసుల సేవలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో 20వ బ్యాచ్‌ పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ బుధవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... నేరాల దర్యాప్తు, ఛేదన, నేరగాళ్ల జాడ పసిగట్టడం, వీఐపీల భద్రతలో జాగిలాల పాత్ర కీలకమైనదని వివరించారు. కార్యక్రమంలో నిఘా విభాగం డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తాజాగా మొత్తం 35 జాగిలాలు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. వీటితో ఏపీలోని మొత్తం పోలీసు జాగిలాల సంఖ్య 212కు చేరింది. అనంతరం జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని