చట్ట విరుద్ధం ఎలా అవుతుంది?

వార్షిక అద్దె విలువ ఆధారంగా ఇళ్లు, భవనాలకు విధించే పన్ను స్థానంలో మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధిస్తే చట్టవిరుద్ధం ఎలా అవుతుందని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.

Published : 29 Sep 2022 03:33 IST

మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నుపై పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న

తీర్పు ప్రతులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: వార్షిక అద్దె విలువ ఆధారంగా ఇళ్లు, భవనాలకు విధించే పన్ను స్థానంలో మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధిస్తే చట్టవిరుద్ధం ఎలా అవుతుందని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఆస్తుల మార్కెట్‌ విలువల పెంపు చట్ట విరుద్ధం కానప్పుడు.. వాటి ఆధారంగా పన్ను విధిస్తే తప్పెలా అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ఇతర రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, పిటిషనర్లను ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్‌ సవరణ చట్టం, జీవో 198ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని