‘108’ వాహనాల ట్రాకింగ్‌ లేకుంటే ఎలా ?: కృష్ణబాబు

రాష్ట్రంలో 108 అంబులెన్సుల కదలికలను గుర్తించే ట్రాకింగ్‌ సిస్టమ్‌ లేకపోవడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 108 సేవలు కొనసాగడంలో ఎందుకు

Updated : 29 Sep 2022 05:20 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 108 అంబులెన్సుల కదలికలను గుర్తించే ట్రాకింగ్‌ సిస్టమ్‌ లేకపోవడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 108 సేవలు కొనసాగడంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం 108 అంబులెన్సుల సేవల పురోగతిని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ హరీంధరప్రసాద్‌, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ... ‘మొత్తం 748లో 164 వాహనాలకు ట్రాకింగ్‌ లేకపోవడంపై ఎవరు బాధ్యత వహిస్తారు’ అని ప్రశ్నించారు. వాహనాల జీపీఎస్‌, జియో ఫేసింగ్‌ విధానం మెరుగుపడాలని, లేదంటే మరో సంస్థ ఎంపిక కోసం రీటెండర్‌కు వెళ్లాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు. పనితీరు మెరుగు కోసం ఏమి చర్యలు తీసుకున్నారని ‘అక్షర’ ప్రతినిధులను ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు వారాల్లోగా మార్పులు రాకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని కృష్ణబాబు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని