ముత్యాలపందిరిలో మురిపాల కృష్ణుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి ముత్యపుపందిరి వాహనసేవ జరిగింది. వాహనంపై శ్రీమలయప్పస్వామివారు వేణుగోపాలస్వామి

Published : 30 Sep 2022 03:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి ముత్యపుపందిరి వాహనసేవ జరిగింది. వాహనంపై శ్రీమలయప్పస్వామివారు వేణుగోపాలస్వామి అలంకరణలో రుక్మిణి, సత్యభామ సమేతంగా తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి సింహ వాహనసేవ జరిగింది. స్వామి వారు యోగనరసింహుని రూపాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనసేవలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని