ఎస్సై, ఏఎస్సైలపై సస్పెన్షన్‌ వేటు

రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న ఆరోపణతో నంద్యాల జిల్లా పాములపాడు ఠాణా ఏఎస్సై యేసయ్య ఓ లారీని సీజ్‌ చేశారు. ఆ అధికారం ఏఎస్సై హోదాకు ఉండదంటూ

Published : 30 Sep 2022 03:18 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న ఆరోపణతో నంద్యాల జిల్లా పాములపాడు ఠాణా ఏఎస్సై యేసయ్య ఓ లారీని సీజ్‌ చేశారు. ఆ అధికారం ఏఎస్సై హోదాకు ఉండదంటూ లారీ యజమాని షేక్‌ మహమ్మద్‌ రఫీక్‌ హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేశారు. ఎస్సై విధుల్లో ఉండగా ఏఎస్సై కేసు ఎలా నమోదు చేస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని శుక్రవారం స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్సై జి.అశోక్‌, ఏఎస్సై యేసయ్యలపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని