రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాస్‌పుస్తకాలు

భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎంపిక చేసిన చోట్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెయ్యి లేదా రెండువేల గ్రామాల్లో ఈ

Published : 30 Sep 2022 03:18 IST

సీఎం ఫొటోతో ముద్రణ

రిజిస్ట్రేషన్‌ సేవల ప్రారంభానికీ చర్యలు

ఈనాడు, అమరావతి: భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎంపిక చేసిన చోట్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెయ్యి లేదా రెండువేల గ్రామాల్లో ఈ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగానే గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించేలా జిల్లా అధికారులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం అక్టోబరు 2వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించేలా చర్చలు సాగుతున్నాయి. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూమి యాజమాన్య హక్కు-భూ రక్ష పథకం పేరుతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకం తొలి పేజీలో సీఎం జగన్‌ ఫొటో పెద్దసైజులో ఉంది. మిగిలిన ఆరుపేజీల్లో భూమి స్వభావం, ఇతర వివరాలు ఉన్నాయి. భూ కమతం గ్రాఫ్‌ కూడా పుస్తకంలో ముద్రించారు. అయితే...శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో కొన్ని పత్రాల్లో నమోదుచేసిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు తెలిసింది. వీటిని సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని