అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి

Published : 30 Sep 2022 03:18 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ద్వారకా తిరుమల ఆలయం నుంచి దుర్గమ్మకు సారెను తీసుకొచ్చి సమర్పించారు. నేడు లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.


కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాల సంబరం అంబరాన్నంటుతోంది. ఉత్సవాల నాలుగో రోజు గురువారం భ్రమరాంబాదేవి భక్తులకు కూష్మాండదుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనంపై కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని