1 నుంచి అమల్లోకి వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా

రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి వైఎస్సార్‌ కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభిస్తారని ప్రభుత్వం

Published : 30 Sep 2022 03:18 IST

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి వైఎస్సార్‌ కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌ కల్యాణమస్తులో ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీలో కులాంతర వివాహాలకు రూ.75 వేలు అందజేయనుంది. షాదీ తోఫాలో ముస్లిం, మైనారిటీలకు రూ.లక్ష, దివ్యాంగుల వివాహాలకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40 వేలు అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునే వధూవరుడు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువు వయసు 18, వరుడి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని