ఉపాధ్యాయ, ఉద్యోగులపై ఏపీ సర్కారు కర్కశత్వం

‘ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? వారిపై కేసులు పెడుతూ.. లోపల వేస్తూ.. ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో

Published : 30 Sep 2022 04:09 IST

 కేసులు పెడుతున్నారు.. లోపల వేస్తున్నారు..

తెలంగాణలో స్నేహపూర్వక వాతావరణం

అయిదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం

దేశంలోకెల్లా ఇక్కడే అత్యధిక వేతనాలు

ఎస్టీయూ సభలో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? వారిపై కేసులు పెడుతూ.. లోపల వేస్తూ.. ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో తెలంగాణలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు గమనించాలి. తెరాస ప్రభుత్వం ఉద్యోగులతో ఎంత స్నేహపూర్వకంగా ఉందో గుర్తించాలి’ అని రాష్ట్ర  మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లాస్థాయి వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేటలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులకు అయిదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్నారని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్లకు కోత విధించిందన్నారు. బావుల వద్ద మీటర్లు పెట్టబోమని చెప్పినందుకు ఏటా రావాల్సిన రూ.6 వేల కోట్లు కోల్పోయామన్నారు. పక్క రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఏడాదికి రూ.7 వేల కోట్ల చొప్పున రెండుమార్లు కేంద్రం నుంచి నిధులు వచ్చాయన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈహెచ్‌ఎస్‌ విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, జీవో నం. 317, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ప్రతినిధులు పొల్గొన్నారు.


ఏపీకి వచ్చి చూస్తే తెలుస్తుంది: బొత్స

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ...  ‘హరీశ్‌రావు మా ప్రభుత్వ విధానంపై మాట్లాడి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి చూస్తే ఇక్కడ టీచర్లకు మేం చేసినవి తెలుస్తాయి. ఇక్కడ టీచర్లు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో ఇచ్చిన పీఆర్సీ, మేం ఇచ్చిన పీఆర్సీల మధ్య తేడా చూస్తే అసలు విషయం తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని