గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి తాళాలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరు గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి వైకాపా నాయకులు, లబ్ధిదారులు గురువారం తాళాలు వేశారు. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద

Updated : 30 Sep 2022 06:19 IST

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ముండ్లమూరు గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి వైకాపా నాయకులు, లబ్ధిదారులు గురువారం తాళాలు వేశారు. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా అధికారులు బిల్లులు మంజూరు చేయడం లేదంటూ ఆగ్రహించిన ముండ్లమూరు వైకాపా జడ్పీటీసీ సభ్యుడు తాతపూడి మోషేజ్‌ రత్నరాజు, పలువురు నాయకులు, లబ్ధిదారులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. బిల్లులు చెల్లించాలని ఏఈ సి.హెచ్‌.హనుమంతరావును నిలదీశారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహించి, కార్యాలయం నుంచి ఆయనను, కంప్యూటరు ఆపరేటర్‌ను బయటకు పంపి తాళాలు వేశారు. నిరసనలో పాల్గొన్న ముండ్లమూరు, పసుపుగల్లు, పెదఉల్లగల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందని, దీంతో కూలీ చేసుకోగా వచ్చిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి శ్లాబులు వేస్తే అధికారులు ఒక్క రూపాయి కూడా బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల సమయంలో అధికారులు వచ్చి పరిశీలించారని, ఇప్పుడు బిల్లులు చేయలేమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముందే నిర్మించుకున్నారు... 

- సి.హెచ్‌.హనుమంతరావు, ఏఈ, గృహ నిర్మాణ శాఖ 

‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం’ ద్వారా ఇల్లు మంజూరు కాకముందే నిర్మాణాలు చేపట్టి శ్లాబులు వేసుకున్నారు. వాటికి బిల్లులు చేయాలంటూ ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. అలా చేస్తే నా ఉద్యోగం పోతుంది. సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ దశల వారీగా ఇళ్ల నిర్మాణాల ఫొటోలు, జియోట్యాగ్‌ చేయాలి. అవేం చేయకుండానే బిల్లులు చెల్లించమని డిమాండ్‌ చేస్తున్నారు. నేను చేయనని చెప్పడంతో మమ్మల్ని బయటకు పంపి తాళాలు వేశారు’ అని ఏఈ హనుమంతరావు తెలిపారు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని