మార్చి నాటికి 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు

వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి

Updated : 30 Sep 2022 06:17 IST

అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

ఈనాడు-అమరావతి: వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. సచివాలయంలో గురువారం ఆయన విద్యుత్తు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి పరిశీలించగా.. ఈ జిల్లాలో వ్యవసాయానికి ఉచిత వినియోగంపై ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తున్న మొత్తం కన్నా రైతులు 30% తక్కువగానే విద్యుత్తు వినియోగించుకుంటున్నట్లు వెల్లడైంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే క్రమంలో లక్ష్యాలను నిర్దేశించాం. రాయితీని నేరుగా పొందేందుకు 70% రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి నూరు శాతం ఖాతాలు తెరిచి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో రైతుల్లో జవాబుదారీతనం వస్తుంది. చంద్రబాబు, కమ్యూనిస్టులు, జనసేన నేతలు రాజకీయ స్వార్థంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు’ అని పెద్దిరెడ్డి ఆరోపించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts