బంకు యజమాని బజారునపడ్డారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో.. 6 నెలల క్రితం వరకు ఐదారు మంది పనివాళ్లను పెట్టుకుని పెట్రోలు బంకు నిర్వహించే వ్యక్తి నేడు ఆ బంకు ఎదుటే ప్లాస్టిక్‌ సీసాల్లో పెట్రోలు విక్రయించే

Published : 30 Sep 2022 04:59 IST

రామగిరి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో.. 6 నెలల క్రితం వరకు ఐదారు మంది పనివాళ్లను పెట్టుకుని పెట్రోలు బంకు నిర్వహించే వ్యక్తి నేడు ఆ బంకు ఎదుటే ప్లాస్టిక్‌ సీసాల్లో పెట్రోలు విక్రయించే స్థితికి చేరుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరులో ఆరేళ్ల కిందట ఒకరికి బంకు డీలర్‌షిప్‌ వచ్చింది. దీన్ని తిమ్మయ్య అనే వ్యక్తి లీజుకు తీసుకుని సుమారు రూ.75 లక్షలు వెచ్చించి పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రోజూ 8 వేల లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు సాగేవి. ఓ వైపు పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులు, సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో రూ.10 తక్కువకు పెట్రోల్‌ లభిస్తుండటంతో ఏపీలోని బంకు యజమానులు దివాలా తీస్తున్నారు. విక్రయాలు జరగక.. నిర్వహణ కష్టంకావడంతో తిమ్మయ్య బంకు మూతపడింది. కనీసం విద్యుత్తు బిల్లు చెల్లించేందుకు ఆదాయం లేక బంకు ఎదుటే ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాల్లో పెట్రోల్‌ అమ్ముకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని