భగీరథ ప్రయత్నం.. భావితరాలకు మార్గం

భగీరథ ప్రయత్నంతో జల సిరులు భువి పైకి తెచ్చారు రైతు కొట్టె వెంకట్రావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామానికి చెందిన ఈ రైతు ఏడాదిపాటు పంటలు పండించేందుకు పరిష్కారం

Published : 30 Sep 2022 04:59 IST

భగీరథ ప్రయత్నంతో జల సిరులు భువి పైకి తెచ్చారు రైతు కొట్టె వెంకట్రావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామానికి చెందిన ఈ రైతు ఏడాదిపాటు పంటలు పండించేందుకు పరిష్కారం చూపారు. సముద్రానికి 5-6 కి.మీ. దూరంలో ఉన్న తన పొలంలో 15 అడుగుల లోతులో భూమికి సమాంతరంగా గొట్టాలు ఏర్పాటు చేశారు. ఈ గొట్టాలకు రంధ్రాలు చేసి.. మట్టి, వ్యర్థాలు పైపులోకి రాకుండా కంకర, చిప్స్‌, ఇసుక, ఫిల్టర్‌ మెస్‌ చుట్టారు. ఊట నీరు పైపులోకి వచ్చేలా చేశారు. ఇలా వచ్చిన నీరు పడేందుకు 18 అడుగుల లోతులో సంపులు ఏర్పాటు చేశారు. ఇందులో నిల్వ ఉన్న నీటిని మోటారు సహాయంతో ఎత్తిపోసి 1.50 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచే సామర్థ్య ఉన్న భారీ సంపులో పోస్తున్నారు. ఈ నీటితో తన 16 ఎకరాల భూమిని సాగు చేస్తున్నట్లు రైతు వెంకట్రావు తెలిపారు. ఇందుకు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు