‘అంతా బాగుందన్నారు.. మా బకాయిలు చెల్లించండి’

ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగుందని స్వయంగా ప్రకటించారని, అందువల్ల ఉద్యోగులకు సంబంధించి డ్రా చేసిన జీపీఎఫ్‌ నిధులు, డీఏలు,

Updated : 01 Oct 2022 06:16 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగుందని స్వయంగా ప్రకటించారని, అందువల్ల ఉద్యోగులకు సంబంధించి డ్రా చేసిన జీపీఎఫ్‌ నిధులు, డీఏలు, సెలవుల నగదు మొత్తం రూ.3 వేల కోట్లు తక్షణమే మంజూరు చేయాలని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ‘పీఆర్సీ అనంతరం ఆరు డీఏలు ప్రకటించినా ఒక్కటీ ఇవ్వలేదు. కేంద్రం రెండు డీఏలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఒక్క డీఏ అయినా ఉద్యోగులకు ఇవ్వాలి. ఉద్యోగులకు జీతం తప్ప మిగతా బెనిఫిట్స్‌ ఏమీ అందడం లేదు. డీఏలు, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ నగదు వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలి...’ అని  శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు