లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల్లో ఐదో రోజు దుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. శుక్రవారంనుంచి భక్తుల రద్దీ పెరిగింది.

Updated : 01 Oct 2022 07:18 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల్లో ఐదో రోజు దుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. శుక్రవారంనుంచి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారు శనివారం మహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలలో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తనున్నారు. కనీసం 2లక్షల మంది భక్తులు ఒకేరోజు తరలిరానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పిస్తారు.


స్కందమాత అలంకారంలో భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవారం శ్రీశైలంలో భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులను శేషవాహనంపై కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని