సాక్షి దినపత్రిక వార్షిక చందాలకు పుర నిధులు

పార్వతీపురం పట్టణంలోని 15 వార్డు సచివాలయాల్లో సాక్షి దినపత్రికను వినియోగించడానికి వీలుగా వార్షిక చందా కింద మొత్తం రూ.15 వేలు పురపాలక సాధారణ నిధుల నుంచి చెల్లించేలా కౌన్సిల్‌ ఆమోదానికి ఎజెండాలో చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది. ఛైర్‌పర్సన్‌ గౌరీశ్వరి అధ్యక్షతన శుక్రవారం పురపాలక సంఘ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

Updated : 01 Oct 2022 05:59 IST

పార్వతీపురం పురపాలక సమావేశంలో చర్చ

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం పట్టణంలోని 15 వార్డు సచివాలయాల్లో సాక్షి దినపత్రికను వినియోగించడానికి వీలుగా వార్షిక చందా కింద మొత్తం రూ.15 వేలు పురపాలక సాధారణ నిధుల నుంచి చెల్లించేలా కౌన్సిల్‌ ఆమోదానికి ఎజెండాలో చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది. ఛైర్‌పర్సన్‌ గౌరీశ్వరి అధ్యక్షతన శుక్రవారం పురపాలక సంఘ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వార్డు సచివాలయాల్లో సాక్షి దినపత్రిక వేయడానికి వార్షిక చందా కింద మొత్తం రూ.15 వేలు పురపాలక సాధారణ నిధుల నుంచి చెల్లించేలా ఎజెండాలో చేర్చారు. దీనిపై తెదేపా కౌన్సిలర్లు శ్రీదేవి, నారాయణరావు, గౌరునాయుడు, వెంకటరమణ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఒక్కటీ తప్ప వేరే దినపత్రికలు లేవా? వాటిని ఎందుకు తీసుకోరని కమిషనర్‌, ఛైర్‌పర్సన్‌ను నిలదీశారు. ఆ పత్రికనే కొనాలని ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. అయితే ఛైర్మన్‌ తదితరులు దీనిపై సరైన సమాధానం చెప్పకుండానే దాటవేశారు. చివరికి ఎజెండాను మిగిలిన కౌన్సిల్‌ సభ్యుల సహకారంతో ఆమోదించారు. పత్రికలకు చందాలు చెల్లించడం సాధారణ ప్రక్రియ అని కమిషనర్‌ రామప్పలనాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని