వారు పట్టించుకోలేదు... వీరు కట్టించుకున్నారు!

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వేంకటేశ్వరకాలనీ ఏర్పడి 15 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ఎక్కడా సిమెంటు రోడ్డూ లేదు... మురుగుకాలువా లేదు.

Published : 01 Oct 2022 05:30 IST

చందాలతో మురుగుకాలువ నిర్మాణం

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వేంకటేశ్వరకాలనీ ఏర్పడి 15 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ఎక్కడా సిమెంటు రోడ్డూ లేదు... మురుగుకాలువా లేదు. దాదాపు 200 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారు. కాలనీలో మురుగుకాలువ నిర్మించాలని స్థానికులు పలుమార్లు అధికారులకు విన్నవించారు. తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగినా ఎవరూ పట్టించుకోలేదు. చేసేది లేక సమస్యను తామే పరిష్కరించుకుందామని 8 నెలల కిందట నిర్ణయించారు. కాలనీలోకి ప్రవేశించే మొదటిక్రాస్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వారు ఒక్కో ఇంటికి రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా చందాలు వేసుకున్నారు. రూ.75 వేలతో మురుగుకాలువ నిర్మించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని