హడలెత్తించిన వాన

వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షం కురిసిన ప్రతీసారి ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి మొదలుకొని వై జంక్షన్‌ వరకు రోడ్లు నదీ ప్రవాహాన్ని తలపిస్తుంటున్నాయి.

Published : 01 Oct 2022 05:30 IST

వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షం కురిసిన ప్రతీసారి ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి మొదలుకొని వై జంక్షన్‌ వరకు రోడ్లు నదీ ప్రవాహాన్ని తలపిస్తుంటున్నాయి. రోడ్డుపైకి చేరిన నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షపు నీటిని బయటకు పంపడానికి నగరపాలక సిబ్బంది ఎక్కడపడితే అక్కడ కాలువలకు గండి కొడుతున్నారు. తవ్విన గోతులు, తెరిచి ఉంచిన మ్యాన్‌హోళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శుక్రవారం ఓ వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. అక్కడున్న యువకులు అతడిని రక్షించారు.

-ఈనాడు, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని