వణికించిన వాన

రాష్ట్రంలో రెండు రోజుల నుంచి విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కుండపోత వర్షాల ధాటికి వాగుల్లో ప్రవాహం పెరిగింది.

Published : 02 Oct 2022 03:41 IST

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే బృందం: రాష్ట్రంలో రెండు రోజుల నుంచి విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కుండపోత వర్షాల ధాటికి వాగుల్లో ప్రవాహం పెరిగింది. పల్లపు ప్రాంతాల్లోకి పెద్దఎత్తున వరద చేరింది. పంట పొలాల్లోనూ నీరు నిలిచింది. శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల మధ్య అత్యధికంగా బాపట్ల జిల్లా అద్దంకిలో 16.6 సెం.మీ., గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 16, సెం.మీ. వర్షం కురిసింది.

కోస్తా, రాయలసీమల్లో వర్షాలకు అవకాశం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంపైనున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.

* పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లులో వర్షం పడుతోందని పొలం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన రైతు కల్లం శివరావు (45), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో పశువులను పోషించే గుంజి వెంకటేశ్వర్లు (54) పిడుగుపాటుకు చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని