రూ.4 కోట్లతో ధనలక్ష్మి అలంకారం

ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమాదేవిని శనివారం రూ.4 కోట్ల నగదుతో ధనలక్ష్మిగా అలంకరించారు.

Published : 02 Oct 2022 03:41 IST

నిడమర్రు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమాదేవిని శనివారం రూ.4 కోట్ల నగదుతో ధనలక్ష్మిగా అలంకరించారు. నోట్లతో పాటు కాశీ నుంచి తెచ్చిన ప్రత్యేక నాణేలను అలంకరణకు ఉపయోగించారు. గత ఏడాది రూ.3.15 కోట్లతో అలంకరణ చేశామని, ఈ సంవత్సరం రూ.4 కోట్లు వినియోగించామని నిర్వాహకులు తెలిపారు.


కన్యకాపరమేశ్వరికి స్వర్ణశోభ

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం స్టోన్‌హౌస్‌ పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శనివారం స్వర్ణాభరణ శోభతో అలరారింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితో పాటు గర్భాలయాన్ని స్వర్ణాభరణాలతో అలంకరించారు. భక్తుల నుంచి సేకరించిన దాదాపు 10 కిలోల స్వర్ణాభరణాలను అలంకరణకు వినియోగించారు.


ధనలక్ష్మిగా గంగా అన్నపూర్ణాదేవి

పల్నాడుజిల్లా నకరికల్లు మండలం నర్శింగపాడులో ని మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని గంగా అన్నపూర్ణాదేవి మందిరాన్ని శనివారం రూ.50 లక్షల నగదుతో అలంకరించారు. రూ.కోటి నగదు అమ్మవారి ముందు ఉంచి పూజలు చేశారు. 

-న్యూస్‌టుడే, నకరికల్లు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts