ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు రేఖను 6 వారాల్లో గీయాలి

సర్వే ఆఫ్‌ ఇండియా ఖరారుచేసిన విధంగా అనంతపురం-బళ్లారి జిల్లాల మధ్య ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులను ఆరువారాల్లోపు భూమిమీద స్పష్టంగా గీయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 02 Oct 2022 04:59 IST

గనుల తవ్వకాల కేసులో కర్ణాటకకు సుప్రీం ఆదేశం

ఈనాడు, దిల్లీ: సర్వే ఆఫ్‌ ఇండియా ఖరారుచేసిన విధంగా అనంతపురం-బళ్లారి జిల్లాల మధ్య ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులను ఆరువారాల్లోపు భూమిమీద స్పష్టంగా గీయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటకలో జరిగిన అక్రమమైనింగ్‌పై విచారణ జరిపించాలని కోరుతూ సమాజ పరివర్తన సముదాయ సంస్థ దాఖలుచేసిన కేసులో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతోకూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును నిర్ధారించినా దాన్ని ఇంకా భూమిపై గుర్తించలేదని అమికస్‌ క్యూరీ శ్యాందివాన్‌ చెప్పారు. ఆ పనిచేయడానికి కర్ణాటక తరఫు న్యాయవాది 6 వారాల సమయం అడిగారు. భూమిపై అంతర్రాష్ట్ర సరిహద్దు రేఖను గీయడానికి 6 వారాల సమయం ఇస్తున్నాం. అలాగే బళ్లారి సరిహద్దుల్లో ఉన్న ఏడు మైనింగ్‌ లీజుల హద్దులను సిద్ధంచేయడానికి జాయింట్‌ టీం ఏర్పాటుచేయాలని శ్యాందివాన్‌ కోర్టును కోరారు. అందుకు అనుగుణంగానే జాయింట్‌ టీం ఈ పనిచేయాలని ఆదేశిస్తున్నాం. భూమిపై అంతర్రాష్ట్ర సరిహద్దురేఖ గీయడం పూర్తయిన మూడునెలల్లోపు ఈ ఏడు లీజుల హద్దులు పూర్తికావాలి’’అని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 2023 జనవరి రెండోవారానికి వాయిదా వేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని