మహిళా సాధికారతకు పెద్దపీట: మంత్రి రోజా

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’లో ఆమె మాట్లాడారు.

Published : 02 Oct 2022 04:59 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’లో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల అభ్యున్నతి కోసం చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన మూడేళ్లలో మహిళా సాధికారత సాధించి చూపారన్నారు. మహిళలకు 50 శాతం పదవులు కట్టబెట్టిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఆర్థికంగా మహిళలకు చేయూత అందించి, డ్వాక్రా చెల్లెమ్మలు సాధికారత దిశగా అడుగులు వేసేలా సీఎం చేశారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా ఆకతాయిలను అదుపులో పెట్టామన్నారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై దాడులు తగ్గాయన్నారు. ఎంపీ భరత్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళా సాధికారతపై కరపత్రాలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సతీమణి భారతిపై రచించిన పుస్తకాన్ని రోజా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉత్సవంలో భాగంగా ఉదయం మానవ అక్రమ రవాణా నిరోధం, దిశ పోలీసుస్టేషన్లను పటిష్ఠపరచడం తదితర అంశాలపై ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ(మహిళా సంరక్షణ) ఎస్పీ కేజీవీ సరిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని