అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోండి

‘ఎన్ని కష్టాలొచ్చినా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం.. మీరు కూడా గొంతెత్తి వికేంద్రీకరణకు మద్దతు తెలపండి.. ఈ దుష్టశక్తులను, ఈ దుర్మార్గుల్ని ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి.. అడుగు ముందుకు వేయకుండా... ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుకోవాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

Updated : 02 Oct 2022 07:15 IST

కాకినాడలో మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు

ఈనాడు - కాకినాడ, న్యూస్‌టుడే - కాకినాడ కలెక్టరేట్‌: ‘ఎన్ని కష్టాలొచ్చినా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం.. మీరు కూడా గొంతెత్తి వికేంద్రీకరణకు మద్దతు తెలపండి.. ఈ దుష్టశక్తులను, ఈ దుర్మార్గుల్ని ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి.. అడుగు ముందుకు వేయకుండా... ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుకోవాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం కాకినాడలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలంతా నాశనమై.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునే వారు బాగుపడాలా..? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దొంగలు, దోపిడీదారులు పాదయాత్రగా వస్తున్నారు. రాష్ట్ర ప్రజల కష్టాన్ని 29 గ్రామాల గోతుల్లో పోయాలని అంటున్నారు. తెదేపా ప్రజాభిమానం కోల్పోయిన పార్టీ. దాని ముసుగులో అమరావతికి మద్దతుగా పాదయాత్ర సాగుతోంది. మా దేవుడి దగ్గరకొచ్చి మాకే శాపనార్థాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలకో.. ఏ ఒక్క ప్రాంతానికో.. వర్గానికో... కులానికో.. ఏదో ఒక రంగానికో అని ఆలోచించకుండా అందరి క్షేమం కోరే వికేంద్రీకరణ నిర్ణయం వైకాపా తీసుకుంది...’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ‘అన్నవరం టు తిరుపతి అని 50 వేల మందితో పాదయాత్ర చేస్తా.. కాకినాడ జిల్లాకే రాష్ట్ర సంపద అంతా తెచ్చిపెడతారా..?’ అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ‘పాలనంతా ఒకచోటే ఉండాలి.. అభివృద్ధి అంటే నేను చేసిందే అనే స్వార్థపూరిత నిర్ణయం చంద్రబాబుది’ అని మరోమంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆచార్య చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని