ప్రతిష్ఠాత్మక సంస్థ.. నిధుల వేటలో తంటా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) పూర్తిస్థాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా అవతరించింది. ఇటీవల మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని నవులూరులో ప్రభుత్వ టౌన్‌షిప్‌లో ప్లాట్లను అమ్మకాలకు పెట్టినా కొనుగోలుదారుల నుంచి స్పందన రాలేదు.

Published : 02 Oct 2022 04:35 IST

పూర్తిస్థాయి స్థిరాస్తి వ్యాపార సంస్థలా సీఆర్డీఏ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) పూర్తిస్థాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా అవతరించింది. ఇటీవల మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని నవులూరులో ప్రభుత్వ టౌన్‌షిప్‌లో ప్లాట్లను అమ్మకాలకు పెట్టినా కొనుగోలుదారుల నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ప్రాపర్టీషోలో సీఆర్డీఏ తరఫున ఏకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అక్కడకు వచ్చే సందర్శకులైనా తమ ప్లాట్లను కొనుగోలు చేయకపోతారా, తద్వారా ఆదాయం సమకూరకపోతుందా అనే ప్రయత్నం చేసింది. ‘రిజిస్ట్రేషన్‌ ధరలో రాయితీలిస్తాం... సులభ వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పిస్తాం... ప్లాట్‌ డబ్బులన్నీ ఒకేసారి చెల్లిస్తే మరో 5% రిబేటు ఇస్తాం...’ అంటూ సందర్శకులకు ఆఫర్లను తెలియచేసింది. ప్రభుత్వం నిర్వహించే ఫ్లాట్ల అమ్మకాలపై ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. అలాంటిది ప్రభుత్వమే వ్యాపారులు నిర్వహించే స్థిరాస్తి ప్రదర్శనలో స్టాల్‌ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ విధులను ప్రతిష్ఠాత్మకంగా నిర్వర్తించాల్సిన సీఆర్‌డీఏ ఇలా నిధులు సమకూర్చుకోవడానికి తంటాలు పడటం గమనార్హమన్నారు.

-ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు