పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం

రాష్ట్రంలో పలుచోట్ల పత్తి తీతలు ప్రారంభం కావడంతో మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 34 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మద్దతు ధర, కేంద్రాలు, రవాణా, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీసీఐ ఆంధ్రప్రదేశ్‌ శాఖ జనరల్‌ మేనేజర్‌ సాయిఆదిత్య ‘ఈనాడు’కు వివరించారు.

Published : 02 Oct 2022 04:35 IST

క్వింటాకు మద్దతు ధర రూ.6,380

‘ఈనాడు’తో సీసీఐ ఏపీ శాఖ జనరల్‌ మేనేజర్‌ సాయిఆదిత్య

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల పత్తి తీతలు ప్రారంభం కావడంతో మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 34 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మద్దతు ధర, కేంద్రాలు, రవాణా, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీసీఐ ఆంధ్రప్రదేశ్‌ శాఖ జనరల్‌ మేనేజర్‌ సాయిఆదిత్య ‘ఈనాడు’కు వివరించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో 6,53,150 హెక్టార్లలో పత్తి సాగైందని.. గతేడాది 4,99,512 హెక్టార్లలో మాత్రమే వేశారని తెలిపారు. ‘‘ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 34 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. వ్యవసాయ మార్కెట్‌ యార్డులతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో 51 జిన్నింగ్‌ మిల్లులను కూడా కొనుగోలు కేంద్రాలుగా గుర్తించాం. రైతుకు సమీపంలో ఉన్న ఏఎంసీ లేదా జిన్నింగ్‌ మిల్లుకు పత్తి తీసుకురావచ్చు. మన రాష్ట్రంలో 90% పొడవు పింజ రకానికి చెందిన పత్తి సాగు చేస్తుంటారు. దీనికి క్వింటాకు రూ.6,380గా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.355 అదనం.కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ముందు రైతుభరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కొనుగోలు చేసి రసీదు ఇస్తాం’’ అని సాయిఆదిత్య వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని