ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నాం

మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు విరామం రోజు శనివారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చినవెంకన్నను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పాదుకామండపం వద్ద మోకాళ్లపై నిల్చుని జైఅమరావతి అంటూ నినదించారు.

Published : 02 Oct 2022 04:35 IST

విశ్రాంతి రోజున చినతిరుపతి వెంకన్నను దర్శించుకున్న అమరావతి రైతులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు విరామం రోజు శనివారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చినవెంకన్నను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పాదుకామండపం వద్ద మోకాళ్లపై నిల్చుని జైఅమరావతి అంటూ నినదించారు. అక్కడినుంచి  మెట్లమార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. మహాపాదయాత్ర ప్రారంభమైన 20 రోజులకు స్వామివారి క్షేత్రానికి చేరుకున్నామని, ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదని రాజధాని జేఏసీ నాయకులు తెలిపారు. అరసవల్లి వరకు ఇలాంటి స్పందనే  ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి అమరావతిని అభివృద్ధి చేయాలంటూ తాము దేవుణ్ని ప్రార్థించామన్నారు. ఆదివారం ఉదయం 8.30కు ద్వారకాతిరుమలలో యాత్ర ప్రారంభమై రాళ్లకుంట మీదుగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం చేరుకుంటుంది. అక్కడ భోజన విరామ అనంతరం రైతులు కొత్తగూడెం, గాంధీకాలనీ మీదుగా దూబచర్ల చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని