‘మహాత్మా.. మీరైనా ఈ ప్రభుత్వానికి చెప్పండి’

‘గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. పంచాయతీల ఖజానాలు ఖాళీ అయ్యాయి. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు.

Published : 03 Oct 2022 03:01 IST

కర్నూలు నగరం(జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే: ‘గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. పంచాయతీల ఖజానాలు ఖాళీ అయ్యాయి. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. ప్రభుత్వానికి మీరైనా చెప్పి పల్లెల తలరాతను మార్చండి’ అంటూ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం కర్నూలు జడ్పీ ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, నిధులు అందక ఏర్పడుతున్న ఇబ్బందులపై విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. దారి మళ్లించిన కేంద్ర నిధులను పంచాయతీల ఖాతాలకు జమ చేయకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని ప్రతాపరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం ప్రతినిధులు శివశంకరనాయుడు, బాలపీరా, బేగ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు