దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్‌

శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆదివారం మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

Published : 03 Oct 2022 03:01 IST

పట్టువస్త్రాల సమర్పణ

ఈనాడు, అమరావతి: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆదివారం మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3గంటలకు దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో మేళతాళాలతో తోడ్కొనివెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం ముఖ్యమంత్రికి అర్చకులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం 3.50గంటలకు ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోయారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్‌, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తదితరులు ముఖ్యమంత్రి వెంట వచ్చారు.


మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తెల్లవారుజామున నుంచే భారీగా వచ్చారు. ఇంద్రకీలాద్రి కొండ, క్యూలైన్లు నిండి భక్తులు రోడ్లపై ఇబ్బందులుపడ్డారు. తోపులాట జరగడంతో పలువురు గాయపడ్డారు. చిన్నారులతో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచివున్నారు.

-ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని